రైతులను అన్ని విధాలా ఆదుకుంటా

గత కొన్ని రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలకు, వరదలకు నియోజకవర్గంలో భారీ నష్టం ఏర్పడిందని, దీని వల్ల కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2024-09-12 13:47 GMT

దిశ,మణుగూరు : గత కొన్ని రోజుల క్రితం వచ్చిన భారీ వర్షాలకు, వరదలకు నియోజకవర్గంలో భారీ నష్టం ఏర్పడిందని, దీని వల్ల కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రకృతి పగపట్టి కన్నెర్ర చేయడంతోనే ఈవిపత్తు జరిగిందని ఆయన తెలిపారు. గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించి వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకార చెక్కులను అందించారు. అనంతరం ప్రజాభవన్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పీరాణాకి నవీన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయం పాల్గొని మాట్లాడుతూ మొన్న భారీ వర్షాల వలన నష్టం జరిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బాధితులకు చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. మొత్తంగా 2036 కుటుంబాలకు16 వేల 500 చొప్పున బాధితుల ఖాతాల్లో జమ చేశామన్నారు. అలాగే ఈ వరద వల్ల మొత్తం ముగ్గురు మృతి చెందరని తెలిపారు. ఆ కుటుంబాలకు వెంటనే ఐదు లక్షల చొప్పున తక్షణ సహకారం అందించామన్నారు. గతంలో కూడా వరదలు రాగా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి కట్టిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పంటలకు నష్టం జరిగిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. చెక్కుల పంపిణీలో తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్ ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News