Pinapaka MLA : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

Update: 2024-11-11 16:42 GMT

దిశ, బూర్గంపాడు : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజరలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలన్నారు.ఏ గ్రేడ్‌ తేమశాతం వచ్చేలా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి రూ.500లు బోనస్ ఇస్తుందన్నారు.

రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు. క్వింటాలుకు ఏ గ్రేడ్‌ ధాన్యం రూ. 2320, సాధారణ ధాన్యం రూ.2300 రేటును నిర్ణయించిందన్నారు..ఈ కార్యక్రమంలో ఏడిఏ తాతారావు,బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్,ఎండిఓ జమాలరెడ్డి సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు, ఏఓ ఆర్. శంకర్,సొసైటీ మాజీ అధ్యక్షులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుర్గెంపూడి కృష్ణారెడ్డి, పినపాక నియోజకవర్గం బి-బ్లాక్ అధ్యక్షురాలు బర్ల నాగమణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భజన ప్రసాద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ బూర్గంపాడు టౌన్ అధ్యక్షులు మందా నాగరాజు, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News