కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అసౌకర్యాలు కలగొద్దు

సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ను కల్పిస్తుందని వ్యవసాయ శాఖ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ సురేంద్రమోహన్ స్పష్టం చేశారు.

Update: 2024-11-09 13:06 GMT

దిశ, వైరా : సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ను కల్పిస్తుందని వ్యవసాయ శాఖ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ సురేంద్రమోహన్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ స్పెషల్ ఆఫీసర్ సురేంద్రమోహన్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పారు.

     రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని వివరించారు. పండించిన పంటను రైతులు దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ చందన్ కుమార్ చందన్ కుమార్, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.


Similar News