MLA : నాణ్యమైన పాల ఉత్పత్తులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి

సత్తుపల్లి పరిసర ప్రాంత రైతులు, నాణ్యమైన పాల ఉత్పత్తుల తో ఆర్థికంగా ఎదగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.

Update: 2024-10-13 15:16 GMT

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి పరిసర ప్రాంత రైతులు, నాణ్యమైన పాల ఉత్పత్తుల తో ఆర్థికంగా ఎదగాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలతో పాడి పరిశ్రమలను రైతులు ఉపయోగించుకొని నాణ్యమైన పాలతో ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. సత్తుపల్లి పట్టణం లోని గాంధీనగర్ సమీపంలో ఆదివారం విజయ పాల డైరీ ని సందర్శించి పాల సేకరణ ఎగుమతి, దిగుమతి పాల ధరలను తెలుసుకుని డైరీ రికార్డ్స్ ను పరిశీలించి, పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆమె కోరారు. డైరీ కి సంబంధిత వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆమె వెంట సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, మున్సిపల్ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విజయ డైరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News