తనను బలి పశువు చేశారంటూ...సూసైడ్ వీడియో విడుదల చేసి కానిస్టేబుల్ ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ అనే కానిస్టేబుల్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో పనిచేసేవారు.

Update: 2024-10-13 14:18 GMT

దిశ-బూర్గంపాడు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ అనే కానిస్టేబుల్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో పనిచేసేవారు. ఏడాది జనవరి నెలలో బూర్గంపాడు పోలీస్టేషన్లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి మాయమైన ఘటనలో విచారణ చేపట్టిన అధికారులు కానిస్టేబుల్ సాగర్ ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు.ఈ క్రమంలో గంజాయి చోరీ కేసులో తనను బలి పశువును చేశారంటూ ఆరోపిస్తూ దసరా పండుగ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు.

బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో పని చేసిన ఎస్సైలు సంతోష్,రాజ్ కుమార్ లు, బూర్గంపాడుకు చెందిన బీఆర్ఎస్ యువజన నాయకుడు గొనెల నాని అనే వ్యక్తితో కలిసి గంజాయిని అమ్ముకున్నారని సాగర్ పేర్కొన్నాడు. గంజాయి మాయమైన విషయంలో ఎస్ఐల పాత్ర ఉందని వారిని వదిలేసి తనపై చర్యలు తీసుకోవడంతో మనస్థాపానికి గురయినట్లు సాగర్ సూసైడ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన స్వగ్రామమైన ఏన్కూరులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వైద్యం కోసం సాగర్ ను ఖమ్మం అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆది నుంచి వివాదాలే....

బూర్గంపాడు పోలీస్ లో స్టేషన్ ఆది నుంచి వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత పది సంవత్సరాలలో ఇక్కడ విధులు నిర్వహించడానికి అధికారులు,రాజకీయ నాయకుల పలుకుబడితో ఏస్ఐలు పోస్లింగ్ తెప్పించుకునేవారేని తెలుస్తోంది. ఈ పది సంవత్సరాల్లో ఈ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్నో గంజాయి కేసులు నమోదయ్యాయి. ఈ గంజాయి కేసుల్లో పట్టుబడిన గంజాయిని అప్పటి పాత పోలీసు స్టేషన్ లో కోర్టులో రిమాండ్ నిమిత్తం ఉంచారు.

ఈ క్రమంలో ఈ పోలీసు స్టేషనుకు ఎటువంటి రక్షణ లేకపోవడంతో అది కాస్తా అక్రమార్కులకు వరం మారింది. విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాగర్ దసరా పండగ పూట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి చెందాడు. గతంలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఎస్ఐ సంతోష్, రాజ్ కుమార్ సహకారంతో ఈ బీఆర్ఎస్ నాయకుడు గోనెల నాని తన అనుచరులు, బంధువులతో పట్టుబడిన గంజాయిని తరలించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రోజు రాత్రి పాత పోలీసు స్టేషన్ లో నిల్వ ఉంచిన గంజాయి తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు.

అసలు దొంగలు తప్పించుకొని...

ఈ క్రమంలో అసలు దొంగలు ఎస్ఐ, బీఆర్ఎస్ నాయకుడు తప్పించుకుని ఇందులో సంబంధం లేని కానిస్టేబుల్ ను బాధితుడిగా చేసి పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కానిస్టేబుల్ సాగర్ ను వేరఘ మండలంలో గంజాయి కేసులో ఇరికించి సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపం చెందిన కానిస్టేబుల్ సాగర్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.

విలేకరులు, రాజకీయ నాయకుల పలుకుబడితో పోస్టింగ్

బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించడానికి గతంలో పనిచేసిన ఎస్ఐ సంతోష్ విలేకరులు,రాజకీయ నాయకుల పలుకుబడితో పోస్టింగ్ వేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. రెండోసారి పోస్టింగ్ పై వచ్చిన ఎస్ఐ సంతోష్ బీఆర్ఎస్ నాయకుల చెప్పుచేతల్లో పనిచేస్తూ అమాయకులను పలు కేసుల్లో ఇరికించిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఎస్ఐను వీఆర్ ఎస్ కు పంపించి రాజ్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చారు. కాగా రాజ్ కుమార్ కూడా ఎస్ఐ సంతోష్ అడుగుజాడల్లో నడిచి అక్రమార్కులకు సహకారం అందించారనే అపవాదు ఉంది. దీంతో బీఆర్ఎస్ నాయకుడు తన అనుచరులు, బంధువులతో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సాగర్ ఈ కేసులో బలియై పోయాడు.

👉 Also Read: గన్​తో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య 


Similar News