బూర్గంపాడు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Update: 2024-10-13 02:20 GMT

దిశ, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో పనిచేసిన కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గతంలో బూర్గంపాడు పోలీసు స్టేషన్‌లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి మాయమైంది. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన బూర్గంపాడు బీఆర్ఎస్ మండల యువజన నాయకుడు గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐల సహకారంతో స్టేషన్‌లో పలు కేసుల్లో పట్టుబడిన గంజాయిని తన అనుచరులు, బంధువులతో తరలించారు. ఈ కేసులో వారంతా తప్పించుకొని సాగర్ అనే కానిస్టేబుల్‌ను బాధ్యుడిని చేయడంతో ఉన్నతాధికారులు అతనిని సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన కానిస్టేబుల్ సాగర్ దసరా పండగ పూట ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

Similar News