పామాయిల్ ఫ్యాక్టరీలు పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ. 36.5 కోట్లలతో నిర్మించిన 2.5 మెగావాట్ల నూతన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఉప మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఆ

Update: 2024-10-12 14:17 GMT

దిశ,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో రూ. 36.5 కోట్లలతో నిర్మించిన 2.5 మెగావాట్ల నూతన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఉప మంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పామాయిల్ సాగు మోడల్ స్టాల్స్ ను పరిశీలించారు. పామాయిల్ రైతు జాతీయ సదస్సులో మంత్రులు ప్రసంగించారు.అనంతరం కొత్త పవర్ ప్లాంట్ ను ప్రారంభించారు.

రైతుల ప్రభుత్వం వచ్చింది: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ రాజ్యం వస్తే సంతోషంగా ఉంటామని ఆశించిన వారి కలలు నెరవేరుతునయన్నారు మంత్రి పొంగులేటి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది. అందులో భాగంగానే పామాయిల్ ఫ్యాక్టరీలో కొత్తగా నిర్మించుకున్న పవర్ ప్లాంట్.. భవిష్యత్తులో దేశంలోనే పామాయిల్ సాగులో తెలంగాణ రాష్ట్రం ముందు ఉండబోతుందన్నారు. అశ్వారావుపేట ప్రాంతం పామాయిల్ సాగుతో సస్యశ్యామలమైంది. ఈ ప్రాంతం పచ్చని తివాచీ పరిచినట్టుగా పామాయిల్ పంటలతో కళకళలాడుతోందన్నారు. అలాంటి పంటను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీలో వ్యర్ధాలతో విద్యుత్ శక్తిని తయారు చేసుకోవడం గొప్ప విషయం..విజయదశమి నాడు రైతులకు ఉపయోగపడే కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

రుణమాఫీలో చరిత్ర సృష్టించాం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

15 రోజుల్లో రూ.18 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో తెలంగాణకు మాత్రమే ఉందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.రాజకీయాలకతీతంగా తనతమ భేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి రైతు రుణమాఫీ డబ్బులు జమ చేశామన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గత బిఆర్ఎస్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకపోగా ఒకేసారి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసిన ప్రజా ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ పై రూ.18 వేల కోట్ల రూపాయల లబ్ధి పొందిన రైతులు గొంతు విప్పాలన్నారు.ఆధార్ కార్డు నెంబర్లు, రేషన్ కార్డు వివరాలు సరిగ్గా లేకుండా అర్హత ఉండి రుణమాఫీ కానటువంటి వారు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ 100% అమలు చేస్తామన్నారు. రైతులు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియాన్ని ప్రజా ప్రభుత్వమే రైతుల తరఫున ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించిందన్నారు.రైతుల పక్షాన ప్రీమియం డబ్బులను ప్రజా ప్రభుత్వమే భీమా కంపెనీలకు చెల్లించిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి క్షేత్రస్థాయిలోకి అధికారులు పంపించి పంట నష్టం అంచనా వేయిస్తున్నమన్నారు.తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఖమ్మం జిల్లాలో ఉన్న అశ్వారావుపేట లో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టామన్నారు.ఆనాటి కాంగ్రెస్ పాలకుల ముందు చూపు వల్లనే ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు.రైతులకు మేలు జరగాలన్న ఆశ,ఆకాంక్షతో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ కర్మాగారం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తూ..ప్రజలు జీవితాలలో వెలుగులు నింపడానికి ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

టన్ను రూ.25 వేలు కాబోతుంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పామాయిల్ సాగు కు పుట్టినిల్లుగా అశ్వారావుపేట పేరొందిందన్నారు మంత్రి తుమ్మల.స్థానికంగా పామాయిల్ సాగుని పరిచయం చేయడంలో ,స్తరించడంలో చర్యలు తీసుకుని అదృష్టం తనకే దక్కిందన్నారు. అందులో భాగంగా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందన్నారు.సొంతంగా విద్యుత్ శక్తిని సొంతంగా తయారు చేసుకునే ప్లాంటును ప్రారంభించుకుంటున్నాం..తెలంగాణ పామాయిల్ సాగు కు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు.నూనెల పై దిగుమతి సుంకం పెంచాలని ఢిల్లి వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు.ఇంపోర్ట్ టాక్స్ పెరగటంతో పామాయిల్ గెలలు ధర పెరిగింది. రానున్న రోజుల్లో పామాయిల్ గెలలు టన్ను రూ.20 వేలు పైగా పెరుగుతుందన్నారు.భద్రాద్రి జిల్లాలో గిరిజన దళిత రైతులకు పట్టాలు ఉన్నా లేకున్నా పామాయిల్ సాగులో ప్రోత్సహిస్తున్నన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటి పంట కాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచారన్నారు.ఆంధ్రా లో నర్సరీ లకు విద్యుత్ పరంగా ఉన్న సబ్సిడీని అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లోని నర్సరీలకు కూడా వర్తింపజేయాలని విద్యుత్ శాఖ మంత్రిని తెలిపానన్నారు.


Similar News