మహిళ SI పై అసత్య ప్రచారం.. కులం పేరుతో దూషించలేదట!
మండల కేంద్రంలోని కాలనీలో ఆదివారం గణేష్ నిమజ్జనం రోజు జరిగిన ఘటనలో స్థానిక ఎస్సై స్రవంతి ఎటువంటి కుల దూష
దిశ, నేలకొండపల్లి: మండల కేంద్రంలోని కాలనీలో ఆదివారం గణేష్ నిమజ్జనం రోజు జరిగిన ఘటనలో స్థానిక ఎస్ఐ స్రవంతి ఎటువంటి కుల దూషణకు పాల్పడలేదని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు సోడేపొంగు ప్రశాంత్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాలనిలో ఎస్ఐ వారి సిబ్బందితో వచ్చి డీజే తీసుకు పోతుంటే కమిటీ సభ్యులందరూ అడ్డం తిరిగామన్నారు. అక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్‌లో ఎస్సైకి వివరించే తరుణంలో అప్రయత్నంగా చేయి ఆమెకు తగలడంతో ఎస్ఐ కోపంతో తాగి నాకొడుకుల్లారా ఏం చేస్తున్నారో అర్ధమవుతుందా అని మాత్రమే అన్నారు. కులం పేరు పెట్టి దూషించలేదని తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో కొందరు నాయకులు ఇన్వాల్ కావడం వల్లే విషయం పెద్దదైందన్నారు.ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని,మావల్ల ఎస్సై ఏదైనా ఇబ్బంది పడితే మేం క్షమాపణ అడగడానికి సిద్ధం గా ఉన్నమన్నారు. కావాలనే కొంతమంది ఎస్సై మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మాకు లేని బాధ వారికెందుకని, మాకు,ఆ కుల రాజకీయాలకు సంబంధం లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.