ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన అవసరం
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.
దిశ,కరకగూడెం : ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శుక్రవారం కరకగూడెం పోలీస్ స్టేషన్ ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీకి కరకగూడెం ఎస్ఐ రాజేందర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ రోహిత్ రాజు స్టేషన్ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే రిసెప్షన్‌ను సందర్శించి పలు నేరల, కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.