దసరా పండుగ ప్రతి ఒక్కరికి విజయం చేకూర్చాలి

దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2024-10-11 14:59 GMT

 దిశ, కొత్తగూడెం : దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలు పేర్చి సందడి చేశారని అన్నారు. విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ఈ పండుగ జిల్లా ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని, అభివృద్ధిలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలని, అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News