అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ.. చర్ల రోడ్డులో రాకపోకలకు అంతరాయం

భద్రాచలం పట్టణంలోని చర్ల వెళ్లే ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Update: 2024-07-18 06:32 GMT

దిశ,భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని చర్ల వెళ్లే ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారి పైకి మురుగునీరు మూడు అడుగులకు పైగా ప్రవహిస్తుండటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థులతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ప్రతి సంవత్సరం ఉత్పన్నం అవుతున్నా.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగి నీరు రోడ్డు పైకి చేరింది.

Tags:    

Similar News