దిశ ఎఫెక్ట్​...వెంటనే గోడ నిర్మించాలి

న్యాయశాఖకు చెందిన స్థలాన్ని కబ్జా చేసిన ఉదంతంపై న్యాయమూర్తి స్పందించారు.

Update: 2024-12-03 13:34 GMT

దిశ, కొత్తగూడెం : న్యాయశాఖకు చెందిన స్థలాన్ని కబ్జా చేసిన ఉదంతంపై న్యాయమూర్తి స్పందించారు. రెండు రోజుల క్రితం దిశ పత్రికలో కోర్ట్ స్థలాన్ని కొల్లగొట్టేస్తున్నారు అనే వార్త ప్రచురితం కావడంతో జిల్లా న్యాయశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి కోర్టు స్థలాన్ని సోమవారం సాయంత్రం సందర్శించారు.

     కబ్జాదారున్ని పిలిపించి ఈ స్థలం వాడవద్దని హెచ్చరించారు. కూలగొట్టిన చోట వెంటనే గోడ నిర్మించాలని ఆదేశించారు. దీంతో కబ్జాదారుడు తాత్కాలికంగా కంచెను కట్టించాడు. కబ్జాదారుడితోనే గోడ కట్టిస్తామని న్యాయశాఖ అధికారులు తెలిపారు. కోర్టు స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కథనాలు ప్రచురించిన 'దిశ' పత్రికకు న్యాయశాఖ సిబ్బంది, లాయర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


Similar News