Disha effect :దిశ ఎఫెక్ట్​...డీసీసీబీ మేనేజర్​ సస్పెన్షన్​

Disha effect : రూరల్ డీసీసీబీలో గత నాలుగేళ్ల క్రితం భూమి లేకుండానే అడ్డగోలుగా రుణాలు ఇచ్చిన వాటి పై గత వారం రోజుల నుంచి దిశ దినపత్రికలో పలు కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే.

Update: 2024-10-29 16:14 GMT

దిశ, ఖమ్మం రూరల్ : Disha effect : రూరల్ డీసీసీబీలో గత నాలుగేళ్ల క్రితం భూమి లేకుండానే అడ్డగోలుగా రుణాలు ఇచ్చిన వాటి పై గత వారం రోజుల నుంచి దిశ దినపత్రికలో పలు కథనాలను ప్రచురించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ క్రమంలో డీసీసీబీ అధికారులు సమగ్ర విచారణ (Comprehensive investigation)చేశారు.

     రూరల్​ డీసీసీబీ లో మేనేజర్​గా పనిచేసిన ఉపేంద్రనాథ్​ను సస్పెండ్​ చేస్తున్నట్లు జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ వసంత్​రావు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపేంద్రనాథ్​ స్థానంలో డీసీసీబీలో విధులు నిర్వర్తిస్తున్న మేనేజర్​ ఎం​. సృజనకు బాధ్యతలు అప్పగించారు.

మిగిలిన వారి పై చర్యలు లేవా..?

అసలు నకిలీ రుణాల్లో అప్పటి బ్యాంక్ మేనేజర్ ఉపేంద్రనాథ్​తో పాటు సూపర్​వైజర్​గా పనిచేసిన వ్యక్తి, తరువాత వచ్చిన మేనేజర్​ది కూడా ప్రధాన పాత్ర ఉన్నట్లు తెలిసింది. క్షేత్రస్థాయి పర్యటనలో రుణం తీసుకునే వ్యక్తి ఇచ్చే షూరిటీని పరిశీలించేది సూపర్​వైజరే. అటువంటిది ఆయన్ని మినహాయించడం వెనుక అంతర్యం ఎమిటో అర్థం కావడం లేదు. కావాలనే కొంతమంది అఫీసర్లు విచారణ సరిగ్గా చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సమగ్ర విచారణ జరిపి మిగిలినవారి పై కూడా చర్యలు తీసుకుని రికవరీ చేయాలని ప్రజలు, ఖాతాదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News