డిప్యూటీ వార్డెన్ సస్పెండ్.. విద్యార్థి మృతిపై ఐటీడీఏ అధికారి సీరియస్

Update: 2024-08-11 07:42 GMT

దిశ, భద్రాచలంః దుమ్మగూడెం మండలం కొత్తపల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కుంజా దీపక్ మృతిపై భద్రాచలం ఐటీడీఏ అధికారి బి.రాహుల్ సీరియస్ అయ్యారు. విధుల పట్ల అలసత్వం వహించిన పాఠశాల హెచ్ఎం నరసింహారావుకు షోకాజ్ నోటీసు ఇస్తూ.. డిప్యూటీ వార్డెన్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. బండారు గూడెం గ్రామానికి చెందిన దీపక్ రెండు రోజులు సెలవులు ఉన్నందున స్నేహితులతో కలిసి తన స్వగ్రామానికి ఆటోలో బయలుదేరుతుండగా ఏటపాక మండలం తునికి చెరువు దగ్గర గుర్తుతెలియని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను హెచ్ఎం నరసింహారావుకు షోకాజ్ నోటీసు ఇస్తూ, డిప్యూటీ వార్డెన్ హరికృష్ణ ను సస్పెండ్ చేయాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మను ఆయన దేశించారు. 

Tags:    

Similar News