Adivasi people : ఆదివాసీల వెతలు తీరేది ఎన్నడు..

అశ్వాపురం మండలంలోని అశ్వాపురం గొంది గూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుక వాగు వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వల్ల ఆదివాసి గ్రామాలైన ఎలకల గూడెం, గొందిగూడెం, భీమవరం, కొత్తూరు, తుమ్మలచెరువు, వెంకటాపురం తదితర గ్రామాలు వంతెన నిర్మాణం ఆగిపోవడం వల్ల మండల హెడ్ క్వార్టర్ తో సంబంధాలు పూర్తిగా తెగిపోయి అంధకారంలోనే ఉంటాయి.

Update: 2024-07-20 14:10 GMT

దిశ, అశ్వాపురం : అశ్వాపురం మండలంలోని అశ్వాపురం గొంది గూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుక వాగు వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వల్ల ఆదివాసి గ్రామాలైన ఎలకల గూడెం, గొందిగూడెం, భీమవరం, కొత్తూరు, తుమ్మలచెరువు, వెంకటాపురం తదితర గ్రామాలు వంతెన నిర్మాణం ఆగిపోవడం వల్ల మండల హెడ్ క్వార్టర్ తో సంబంధాలు పూర్తిగా తెగిపోయి అంధకారంలోనే ఉంటాయి. రాకపోకలు నిలిచిపోవడం వల్ల వర్షాకాలంలో గ్రామస్తుల కష్టాలు అంతా ఇంతా కాదు. బాలింతలు, వృద్ధులు, విద్యార్థులు ఈ వర్షాకాలంలో మాత్రం నిత్యం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలు విషయమై అప్పటి ప్రభుత్వాన్ని వేడుకోగా నిర్మాణం చేపట్టి మధ్యలోనే ఆగిపోవడం వల్ల ఈ ఏడాది కూడా ఆదివాసీలకు ఇక్కట్లు తప్పడం లేదు.

వారి కష్టాలను చూసి ఆ గ్రామ సర్పంచ్ తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసిన ఒక్క వరద ఉధృతితోనే మొత్తం కొట్టుకుపోయింది. మళ్లీ ఆదుకునే పరిస్థితి ఎవరికీ లేదు. ఆ గ్రామాలలోని వాహనాలను కూడా వంతెనకు ఒక ప్రక్కనే నిలిపి వాగును దాటి వారి గ్రామాలకు చేరుకోవాల్సి వస్తుంది. ఒకవేళ జరగరాని ఘోరం ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా పెద్ద మోరీ లను ఏర్పాటు చేసి వాటిపై కొంత కాంక్రీటు, మట్టితో గట్టిగా తాత్కాలికమైన వంతెనను ఏర్పాటు చేసి, ప్రస్తుత రాకపోకలకు ఎటువంటి ఆటకం కలిగించకుండా చూడాలని అలానే నిర్మాణం చేపట్టిన నిలిచిపోయిన వంతెనను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులు, నియోజకవర్గ శాసనసభ్యులను ఆదివాసి ప్రజలు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News