Collector Jitesh V. Patil : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి
సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల
దిశ, కొత్తగూడెం : సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ శాఖల వారీగా అధికారులను ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని ఆయన అధికారులకు సూచించారు. తమ సమస్యలపై దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.
వారి సమస్యలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓపికగా విని, సదరు దరఖాస్తు పై పరిశీలించి సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని, ప్రజావాణిలో సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.