సమస్యలపై కలెక్టర్ అనుదీప్ సత్వర స్పందన..
తమ సమస్యలు విన్నవించుకునేందుకు సోమవారం ప్రజవాణికి ప్రజలు పోటెత్తారు.
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : తమ సమస్యలు విన్నవించుకునేందుకు సోమవారం ప్రజవాణికి ప్రజలు పోటెత్తారు. అయినప్పటికి కలెక్టర్ అందరి సమస్యలు ఓపికగా వింటూ వాటి పరిష్కారానికి సత్వరం స్పందిస్తూ, అధికారులకు తగిన ఆదేశాలు జారీచేస్తున్నారు. మండల అధికారులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ సమస్యల గురించి విని వాటి పరిష్కారానికి తగిన ఆదేశాలు ఇస్తున్నారు.
అశ్వారావుపేట మండలంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని, బ్యాంకు అధికారులు రికవరీ చేస్తున్నారని, బాధితుడు ఫిర్యాదు చేయడంతో లీడ్ బ్యాంకు మేనేజర్ ను పిలిచి ఏ రూల్ ప్రకారం ఇలా పెన్షన్ డబ్బులు రికవరీ చేస్తున్నారని ప్రశ్నించారు. అశ్వారావుపేట ఎంపీడీఓను వీడియో కాన్ఫెరెన్సులో లైన్ లోకి తీసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకు మేనేజర్ కు నోటీసు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇలా విభిన్న సమస్యలకు తనదైన రీతిలో పరిష్కారం చూపుతూ ఒపీగా ప్రజావాణిలో సమస్యలు వింటున్న కలెక్టర్ ను బాధితులు ప్రశంసిస్తున్నారు.