CM : గంగారం తండా లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన గంగారం తండా లో సీఎం మంగళవారం పర్యటించారు.
దిశ, కారేపల్లి: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన గంగారం తండా లో సీఎం మంగళవారం పర్యటించారు. ఆకేరు వాగు వరద ప్రవాహంలో మృతి చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని తండ్రి మోతీలాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గంగారం తండా లో పర్యటించారు.
అశ్విని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు..
బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారితో మాట్లాడారు. సైంటిస్ట్ అశ్విని తండ్రి మోతిలాల్ వరద ప్రవాహంలో మృతి చెందటం బాధాకరమన్నారు. ఈ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఐదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందిస్తుందని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ ను కోల్పోవడం బాధాకరమని ఆ కుటుంబానికి సైంటిస్ట్ హోదాకు తగిన విధంగానే న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ప్రభుత్వ సలహాదారు వేం. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.