ఎర్రగుట్ట ప్రాంతంలో చిరుత సంచారం నిజమే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, ఏన్కూరు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ఎర్రగుట్ట పొలాల్లో చిరుత సంచారం నిజమేనని అధికారులు తెలిపారు.

Update: 2024-10-15 13:51 GMT

దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, ఏన్కూరు మండలాల సరిహద్దు అటవీ ప్రాంతమైన ఎర్రగుట్ట పొలాల్లో చిరుత సంచారం నిజమేనని అధికారులు తెలిపారు. మంగళవారం తల్లాడ, జూలూరుపాడు రేంజ్ అటవీ అధికారులు ఎర్రగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. రైతుకు చెందిన ఓ కుక్కని గుట్ట పైకి తీసుకువెళ్లి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, రైతులు కొన్ని రోజులు రాత్రి సమయంలో పొలాల వద్దకు వెళ్లవద్దని కోరారు. ఆయా గ్రామాలలో దండోరా వేయించి అవగాహన కల్పిస్తున్నామని జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు తెలిపారు. కొన్ని రోజులు వరకు ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. 

Tags:    

Similar News