పరీక్షలు రద్దు చేయించేందుకు బీఆర్ ఎస్ కుట్రలుః మంత్రి పొంగులేటి

Update: 2024-08-21 14:49 GMT

ఖమ్మం, రూరల్: ఇప్పుడు తెలంగాణలో జరగుతున్న పోటీ పరీక్షలను రద్దు చేయించి.. నిరుద్యోగుల్లో తమ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకురావాలని బీఆర్ ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని.. బీఆర్ ఎస్ లాగా పదే పదే పరీక్షలను రద్దు చేయకుండా.. నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షం, దానికి తోడైన మరో విపక్షం వెర్రి కూతలు కూస్తున్నాయని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న ఉచిత కోచింగ్ క్యాంపును ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా వందలాదిగా హాజరైన నిరుద్యోగ అభ్యర్థులను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. 45 రోజుల్లోనే టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేశామని, పేపర్ లీకేజీలు లేకుండా నిరుద్యోగుల నమ్మకాన్ని పొందామని అన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని రూ.31వేల కోట్లతో అమలు చేస్తున్నామని తెలిపారు.

నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంది..

ఈ ప్రభుత్వానికి పేదలు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పోటీ కాంగ్రెన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు.

జిల్లాలో త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ బ్రాంచ్

నిరుద్యోగుల భవితవ్యానికి భరోసా కల్పించేలా హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. అక్కడ శిక్షణ పొందిన వారు మరో వంద మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని అన్నారు. త్వరలోనే జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

నిరుద్యోగులను తీర్చిదిద్దడంలో మెండెం కిరణ్ మేటి..

2016 నుంచి రైట్ చాయిస్ అధినేత మెండెం కిరణ్ తనకు తెలుసని రాష్ట్ర రెవెన్యూ ముంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గతంలో నిరుద్యోగుల కోసం పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ను పెట్టగా.. కిరణ్ పర్యవేక్షణలో 300 మందికి ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి గ్రూప్ పరీక్షలు, ఎస్సై, కానిస్టేబుల్ పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ నిర్వహించబోతుండడం ఆనందంగా ఉందని తెలిపారు. అందరూ కష్టపడి చదివి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు నుంచి పేరు తీసుకురావాలని కోరారు.

మంత్రి పొంగులేటి సేవాభావం గ్రేట్: ఎంపీ రఘురాం రెడ్డి

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతుంటారని, అందరి బాగోగులు తెలుసుకుంటూ ప్రజా సేవ చేస్తారని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండడం అరుదని కొనియాడారు. తన విజయంలో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేశారు. ఓ ఎంపీగా జిల్లాలోని నిరుద్యోగుల బాగుకు తప్పకుండా సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మయ్య, ప్రొఫెసర్ చింతా గణేష్, జ్యోతి రెడ్డి, కాంగ్రెన్ ఖమ్మం రూరల్ ముండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు మద్ది మల్లారెడ్డి, కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భద్రకాళి, హారికా నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News