BREAKING: మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, హరిప్రియ ముందస్తు అరెస్ట్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Update: 2024-08-15 06:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం ఏన్కూరు లింక్ కెనాల్ నుంచి వైరా రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తారు. దీంతో గోదావరి జలాలు మరికొద్ది గంటల్లోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరనున్నాయి. పంప్ హౌజ్ ప్రారంభోత్సవం తర్వాత అనంతరం వైరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. ఆ సభలోనే రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిధులు విడుదల చేస్తారు. ఈ క్రమంలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు చేపట్టారు. సీతారామ ప్రాజెక్టుల ద్వారా భద్రాద్రి జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలంటూ నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బానోత్ హరిప్రియను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఇక వైరా మండల కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Tags:    

Similar News