Bhatti Vikramarka : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా వైరా పర్యాటక కేంద్రం అభివృద్ధి
వైరా రిజర్వాయర్ గుట్టలపై అస్తవ్యస్తంగా ఉన్న పర్యాటక కేంద్రాన్ని
దిశ, వైరా : వైరా రిజర్వాయర్ గుట్టలపై అస్తవ్యస్తంగా ఉన్న పర్యాటక కేంద్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడమేకాకుండా వైరా నుంచి రిజర్వాయర్ అలుగులు, రెడ్డిగూడెం మీదుగా తల్లాడ వరకు నూతన రోడ్డును నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సోమవారం రాత్రి వైరా రిజర్వాయర్ పర్యాటక కేంద్రాన్ని వారు సందర్శించి పరిశీలించారు. అనంతరం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో వారు ప్రసంగించారు. వైరాలోని క్రాస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి వైరా రిజర్వాయర్, అలుగుల ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ రెడ్డిగూడెం మీదుగా తల్లాడకు కొత్తగా రోడ్డు నిర్మిస్తామని దీని ద్వారా రవాణా దూరం తగ్గడమేకాకుండా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని స్పష్టం చేశారు.
వైరా పర్యాటక కేంద్రానికి వచ్చే పర్యాటకులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని వివరించారు. వైరా పర్యాటక కేంద్రంలో వసతి భవనాలు నిర్మించి పర్యాటకులు సేదతీరేలా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అలాగే ఎన్నెస్పీ నుంచి సాగర్ జలాలు తీసుకువచ్చి వైరా రిజర్వాయర్ ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్ లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, పటేల్ రమేష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అధ్యకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, దొబ్బల సౌజన్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్. మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైరా, కొణిజర్ల మం డలాలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణ, ఏదునూరి సీతరాములు, నాయకులు పణితి సైదులు, దాసరి దానియేలు, ధార్న రాజశేఖర్, కల్ల సంతోష్, జాలాది రామకృష్ణ. పలువురు నాయకులు పాల్గొన్నారు.