భట్టి అన్నా.... వివాహానికి రండి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్ లో శుక్రవారం కాంగ్రెస్ నేత షర్మిల మర్యాద పూర్వకంగా కలిసి తన కుమారుడి పెండ్లికి రావాలని కోరారు.
దిశ , ఖమ్మం కార్పొరేషన్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రజాభవన్ లో శుక్రవారం కాంగ్రెస్ నేత షర్మిల మర్యాద పూర్వకంగా కలిసి తన కుమా రుడి పెండ్లికి రావాలని కోరారు. ఈనెల 18న తన తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన జరిగే పెండ్లికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం కావడం తనకెంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.