హామీల అమలుకు సమరశీల పోరాటాలకు సిద్ధం కండి

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని మహిళలకు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభలో వక్తలు పిలుపునిచ్చారు.

Update: 2024-10-23 13:37 GMT

దిశ, కొత్తగూడెం : బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని మహిళలకు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభలో వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అనేక పోరాటాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా ఇండ్లు, ఇళ్ల స్థలాల సమస్యపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినట్టు చెప్పారు. దాంతో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిందని, జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో నెలరోజుల పాటు మహిళలని జైల్లో ఉంచారని పేర్కొన్నారు.

    అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక రకాల వాగ్దానాలు చేసిందని, 6 గ్యారంటీల అమలు కాంగ్రెస్ అటకెక్కించిందని విమర్శించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా హాజరైన ప్రతినిధులు చర్చించిన కార్యకలాపాల నివేదికను ఏకగ్రీవంగా తీర్మానించారు. రెండు రోజులపాటు జరిగిన ఐదవ రాష్ట్ర మహాసభల్లో పలు ప్రజాసంఘాల నేతల ప్రసంగాలు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపింది. రానున్న కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు చేయాలని మహాసభ నిర్ణయించింది. మహాసభల్లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.జ్యోతి, బుగ్గవీటి సరళ, ఆశాలత, అనురాధ, మాచర్ల భారతి, రత్నమాల, బండి పద్మ, డి.ఇందిర,కె. నాగలక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు సీతాలక్ష్మి పాల్గొన్నారు. 

Tags:    

Similar News