తాట తీస్తా.. వారికి సీఎల్పీ నేత భట్టి వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: దళిత బంధు పేరిట లబ్ధిదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసే దళారులు
దిశ.చింతకాని: దళిత బంధు పేరిట లబ్ధిదారుల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసే దళారులు, బ్రోకర్లు, మోసగాళ్ల తాటతీస్తానని, పోలీస్ కేసులు పెట్టిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వార్నింగ్ ఇచ్చారు. దళిత బంధు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసే దళారులు, మోసగాళ్లు, బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. చింతకానిలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు డబ్బులు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. సిగ్గులేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచితే ప్రజలు కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..?ప్రధాని మోడీ పెట్రోల్, డీజిల్ గ్యాస్, ధరలు పెంచి ప్రజలపై భారం మోపి నడ్డివిరుస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపడం సిగ్గుచేటు అని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలిని,లేకుంటే ఉద్యమాలతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు.
5వేలు రావాల్సిన కరెంట్ బిల్లు 96 వేలు బిల్లు వేస్తే కట్టడం సాధ్యమేనా? ప్రజలపై ఇదేమి కరెంటు భారం. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని సూచించారు. లేకుంటే గత పాలకులకు పట్టిన గతే టీఆర్ఎస్ సర్కార్ కు పడుతుంది హెచ్చరించారు.