మరోమారు పొంచి ఉన్న ముప్పు
వరుణుడు మరోమారు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మున్నేరు పరీవాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.
దిశ బ్యూరో,ఖమ్మం : వరుణుడు మరోమారు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మున్నేరు పరీవాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం నుంచి మళ్లీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మున్నేరు తో పాటు ఇతర ప్రాంతాల ముంపు బాధితుల పరిస్థితిని అంచనా వేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆయా నియోజకవర్గ, మండలాల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. అన్నపానీయాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. రోడ్లపై వాహనాల రాక పోకలపైన శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.