అదనపు కలెక్టర్ గారు.. జర అడ్డు జరగండి సారు...

సామాన్యులకు చలాన్ల చిల్లులు పడుతుంటే జిల్లా ఒక ఉన్నతాధికారి హోదాలో ఉంటూ ఆదర్శప్రాయంగా నిలవాల్సిన అదనపు కలెక్టర్ నడిరోడ్డుపై వాహనం ఆపి ముచ్చట్లు పెడుతున్న చిత్రం దిశకు చిక్కింది.

Update: 2023-05-01 09:06 GMT

దిశ ప్రతినిధి, కొత్తగూడెం : సామాన్యులకు చలాన్ల చిల్లులు పడుతుంటే జిల్లా ఒక ఉన్నతాధికారి హోదాలో ఉంటూ ఆదర్శప్రాయంగా నిలవాల్సిన అదనపు కలెక్టర్ నడిరోడ్డుపై వాహనం ఆపి ముచ్చట్లు పెడుతున్న చిత్రం దిశకు చిక్కింది. ఉన్నతాధికారి హోదాలో ఉన్న ఆయనను అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కలవడం సర్వసాధారణమైన విషయమైనప్పటికీ నడిరోడ్డు పైన వాహనం ఆపి వాహనదారుల ఇబ్బంది ఏ మాత్రం పట్టించుకోకుండా నిమిషాల వ్యవధి కొంతమందితో ముచ్చట్లు పెట్టడం చూసిన ప్రజలు అధికారి వ్యవహార శైలిపై పెదవి విరుస్తున్నారు.

సామాన్యులకు హెల్మెట్ లేకున్నా, పార్కింగ్ గీత దాటిన చలాన్ల మోత మోగుతుంది. సామాన్య ప్రజలకు ఒకన్యాయం ప్రజలను పాలించాల్సిన అధికారులకు మరో న్యాయమా అంటూ అధికారులను నిలదీసే ధైర్యం సరిపోక, ప్రశ్నిస్తే కేసులు పెడతారేమో అన్న భయంతో ఒకంత అసహనానికి లోనై వెను తిరుగుతున్నారు. ఏదేమైనా ఒక ఉన్నతాధికారి స్థానంలో ఉంటూ నడిరోడ్డుపై బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆ అధికారికి చలాన్ విధిస్తే తప్ప ఈ వ్యవహారం చూసిన ప్రజలకు పోలీసులపై నమ్మకం కుదిరే పరిస్థితి కనబడడం లేదు.

Tags:    

Similar News