కరెన్సీ నోట్లతో అమ్మవారి మండపం

దేవీ నవరాత్రి వేడుకల్లో అశ్వారావుపేట వాసులు మండపాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించి అందరినీ ఆకట్టుకున్నారు.

Update: 2024-10-06 15:26 GMT

దిశ, అశ్వారావుపేట : దేవీ నవరాత్రి వేడుకల్లో అశ్వారావుపేట వాసులు మండపాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ డెకరేషన్ కు లక్షల రూపాయలను ఉపయోగించారు. కానీ అవన్నీ నిజమైనవి కాదు. బొమ్మ కరెన్సీ మాత్రమే. కానీ దూరం నుంచి చూస్తే అచ్చం నిజమైన నోట్లతో అలంకరించినట్టే కనిపిస్తుంది. దాంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

     అశ్వారావుపేట మండల కేంద్రం నాయీబ్రాహ్మణ బజారులో ఆ సంఘం ఆధ్వర్యంలో దేవీశరన్నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని కాస్లీగా అలంకరించాలనుకున్నారు. కానీ అంత డబ్బు లేకపోవడంతో నిరాశ చెందారు. దాంతో పిల్లలు సరదాగా ఆడుకునేందుకు మార్కెట్లో దొరికే డమ్మీ కరెన్సీ నోట్లను ఉపయోగించారు. 500, 200,100,50, 20,10 నోట్ల తోరణాలతో మండపాన్నిఅందంగా అలంకరించారు. దూరం నుంచి చూస్తే అచ్చం నిజమైన నోట్లతోనే అలంకరించినట్టు కనిపించడంతో అందరూ ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. 

Tags:    

Similar News