రామయ్య సన్నిధి నుంచి వెంకన్న సన్నిధికి.. లోక కళ్యాణార్థం పాదయాత్ర..

లోక కళ్యాణార్థం త్రివేణి, కృష్ణవేణి విద్యాసంస్థల ప్రతినిధులు, సిబ్బంది, వారి మిత్ర బృందం తిరుమలకి పాదయాత్రగా బయలుదేరింది.

Update: 2024-09-20 04:17 GMT

దిశ, కొత్తగూడెం : లోక కళ్యాణార్థం త్రివేణి, కృష్ణవేణి విద్యాసంస్థల ప్రతినిధులు, సిబ్బంది, వారి మిత్ర బృందం తిరుమలకి పాదయాత్రగా బయలుదేరింది. గురువారం భద్రాచలంలోని శ్రీ రాములవారి సన్నిధి నుండి బయలుదేరి శుక్రవారం కొత్తగూడెం మీదుగా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకునేందుకు భక్త బృందం బయలుదేరి వెళ్లింది. కృష్ణవేణి, త్రివేణి సంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను విపత్తుల నుంచి కాపాడాలని భగవంతుని ప్రార్థిస్తూ, లోక కళ్యాణార్థం ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఆరుసార్లు తిరుమలకి పాదయాత్ర చేశామని, విజయవంతంగా ఏడవసారి పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. 620 కిలోమీటర్ల యాత్ర, 18 రోజుల పాటు జరగనుంది. ఈ పాదయాత్రలో త్రివేణి, కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్లు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సిబ్బంది, మిత్రులు, కాట్రగడ్డ మురళీకృష్ణ, రాఘవ, రమేష్, శ్రీనివాస్, సతీష్, సనత్, సందీప్, అశోక్, రామకృష్ణ ఉన్నారు.


Similar News