రాకాసితండాను పరిశీలించిన కేంద్ర బృందం

వరదధాటికి సర్వం కోల్పోయిన రాకాసి తండాను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది.

Update: 2024-12-03 13:58 GMT

దిశ,తిరుమలాయపాలెం : వరదధాటికి సర్వం కోల్పోయిన రాకాసి తండాను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. సెప్టెంబర్ నెల మొదటి వారంలో వచ్చిన భారీ వర్షాలకు మండలంలోని అజ్మీరా తండా పరిధి రాకాసి తండా సమీపాన ఉన్న ఆకేరు ఉధృతికి రాకాసితండా ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఆకేరుకు వరద పోటెత్తడంతో వరద ధాటికి కోతకు గురైన బ్రిడ్జి, రోడ్లు, విద్యుత్ మరమ్మతుల పనులతోపాటు గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న ఇండ్లు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందిస్తామని తెలిపారు. కేంద్ర బృందం పరిశీలకులు అమిత్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ఎంపీఓ సూర్యనారాయణ, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. 


Similar News