Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి
దిశ,మధిర : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు . సోమవారం ఉదయం హైదరాబాద్ ప్రజా భవన్ నుంచి రోడ్డు మార్గాన మధిర కు చేరుకున్నారు . మధిర మండల పరిధిలోని సిరిపురం గ్రామ సమీపంలోని యండ్రపల్లి గుట్టల వద్ద ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అల్లీనగరం నుండి బయ్యారం వరకు రూ 2 కోట్లు లతో నిర్మించనున్న పి ఆర్ రోడ్డు కు , మునగాల ( కృష్ణాపురం ) నుంచి నక్కల గరువు రూ 2 కోట్ల 70 లక్షలు తో నిర్మాణం చేపట్టనున్న పి ఆర్ రోడ్డుకు , రాయపట్నం నుండి మడుపల్లి వరకు పి ఆర్ రోడ్డు నిర్మాణ పనులకు , దేశినేని పాలెం నుండి మడుపల్లి వరకు రూ 6 కోట్ల 50 లక్షలు తో నిర్మాణం చేపట్టనున్న పీఆర్ రోడ్డుకు అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టడంతో వ్యవసాయదారులకు పంటలను మార్కెట్ కు , ఇళ్లకు తరలించేందుకు సౌకర్యంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.