TG High Court: హైడ్రా నోటీసులే షోకాజ్ నోటీసులు ‘దుర్గం చెరువు’ నోటీసులపై హైడ్రాకు హైకోర్టు రిలీఫ్
హైడ్రా ఇ్చచిన నోటీసులే షోకాజ్ నోటీసులు గా భావించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఇచ్చిన నోటీసులనే షోకాజ్ నోటీసులుగా భావించి అధికారులకు సహకరించాలని ఆదేశించింది. దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ, కావురి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా ఇచ్చిన నోటీసులపై ఆ ఇండ్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులు ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా భావించాలని ఇళ్ల యజమానులు అదేశించారు. ఈ విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.