మంత్రులకు లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు.. ఎవరికి ఏ సెగ్మెంట్ ఇచ్చారో తెలుసా?

లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ స్థానాలకు ఇన్‌చార్జులుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది.

Update: 2023-12-18 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ స్థానాలకు ఇన్‌చార్జులుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. సీఎం, డిప్యూటీ సీఎంలకు రెండేసి చొప్పున లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఇన్‌చార్జిగా సీఎం రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్, మహబూబాబాద్ ఇన్‌చార్జిగా భట్టి విక్రమార్క, ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, నల్లగొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్‌కు పొన్నం ప్రభాకర్ గౌడ్, నాగర్‌కర్నూలుకు జూపల్లి కృష్ణారావు, పెద్దపెల్లికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భువనగిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, జహీరాబాద్‌కు పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్‌కు జీవన్ రెడ్డి, మెదక్ దామోదర రాజనర్సింహా, మల్కాజిగిరి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ కొండా సురేఖను ఇన్‌చార్జీలుగా అధిష్టానం నియమించింది.

Tags:    

Similar News