మేడిగడ్డ బ్యారేజీ కుంగింది.. సీఎం కేసీఆర్ పాపం పండింది: రేవంత్ రెడ్డి ఫైర్

డిజైన్‌కు అనుగుణంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరగలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై రేవంత్

Update: 2023-11-04 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: డిజైన్‌కు అనుగుణంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరగలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై రేవంత్ రెడ్డి శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది.. సీఎం కేసీఆర్ పాపం పండింది.. కేసీఆర్ ధన దాహానికి నిదర్శనం మేడిగడ్డ అని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్ అన్నారు.. ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ, పర్యవేక్షణ ఘనత అంతా కేసీఆర్‌దేనని చెప్పారు. కానీ, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో తప్పును అధికారులకపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఇంతపెద్ద తప్పు జరిగిన కేసీఆర్ నోరు మెదపట్లేదని సీరియస్ అయ్యారు. మేడిగడ్డ కుంగుబాటుపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్‌దేనని అన్నారు. మేడిగడ్డ ఘటనపై కేంద్రం నివేదిక ఇచ్చి చేతుల దులుపుకోవడం కాకుండా.. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News