ఆ రెండు పథకాలు మా మేనిఫెస్టోలో లేవు: మంత్రి KTR కీలక వ్యాఖ్యలు

కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా సాధికారత సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

Update: 2023-11-19 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా సాధికారత సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థినులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్య వల్లే తెలంగాణ స్టూడెంట్స్ ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని అన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం, మహిళలు సంపద సృష్టించాలనే ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. మా మేనిఫెస్టోలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు లేవు, మేనిఫెస్టోలో లేకున్నా మహిళల కోసం ఈ రెండు స్కీమ్స్ అమలు చేశామని స్పష్టం చేశారు. మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘వి’  హబ్‌లు ఏర్పాటు చేశామన్నాడు. రాష్ట్రంలో ప్రతిచిన్నారిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ శాతం భారీగా పెరిగిందన్నారు. 

Tags:    

Similar News