దేశంలోనే ఎక్కడ ఇలాంటి పథకం లేదు: మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలో గల

Update: 2023-10-06 06:51 GMT

దిశ, సిటీ బ్యూరో: బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలో గల మునగ రామ్ మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం (సీఎం బ్రేక్ ఫాస్ట్) కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్థులతో కూర్చొని అల్పాహారం చేశారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వానికి, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 27 వేల స్కూళ్లలో 23 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు మాత్రమే బ్రేక్ ఫాస్ట్ కల్పిస్తున్నారని, కానీ మన ముఖ్యమంత్రి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దేశంలోని ఇలాంటి పథకం లేదని అన్నారు. బంగారు తెలంగాణలో భావితరాలు పౌష్టికంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకొని రాష్ట్రంలో పాఠశాలకు వచ్చే విద్యార్థి కూడా పౌష్టికాహారం లోపం లేకుండా ఉండేందుకు అల్పాహార పథకంకు శ్రీకారం చుట్టిందని అన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 1314 పాఠశాలలో 2,38,808 మంది విద్యార్థిని విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అల్పాహారం‌పై ఫీడ్ బ్యాక్ తెలియజేయాలని మంత్రి టీచర్లను విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అంతేకాక ఈ ప్రాంత ప్రజలు కూడా పరిశీలించి ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు. ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరింత మెరుగైన అల్పాహార అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు మంత్రి కొన్ని సూచనలు చేశారు. క్వాలిటీ ఎప్పటి కప్పుడు ర్యాండమ్ చెకింగ్ చేసి నాణ్యతపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

Tags:    

Similar News