రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తా.. తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన

ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-05-03 13:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అంతుకుముందు నామినేషన్ ర్యాలీలో కీలక ప్రకటన చేశారు. గతంలో చెప్పినట్టుగా.. తన కుటుంబానికి ఉన్న కోటిన్నర విలువైన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

ఈ మేరకు నామినేషన్ పత్రంతో పాటు తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పజెప్తానన్న బాండ్‌ను కూడా వెంట తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్లి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగిస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు. అంతేకాకుండా.. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసాకు జవాబుదారిగా ఉంటానని ప్రకటించారు. తనలా ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికల్లో నిలబడాలంటూ ప్రత్యర్థులకు మల్లన్న సవాల్ విసిరారు.

Tags:    

Similar News