కాంగ్రెస్‌ది థర్డ్ ప్లేస్.. బీజేపీ, BRS మధ్యే పోటీ: మాజీ CM కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది.. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. పరిస్థితులను

Update: 2024-04-27 13:13 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది.. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్‌లో బసచేశారు. శనివారం మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ హామీలు, విద్యుత్తు, మంచినీరు, సాగునీరు తదితర సమస్యలను తెరపైకి తీసుకొస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించాలని మాజీ ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌తో మనకు పోటీ లేదు. బీజేపీ తోటే పోటీ. మీరు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా మన అభ్యర్థులు గెలుస్తారని హితబోధ చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం మేము చేసుకున్న ప్రయత్నాల కన్నా ఎక్కువగా ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Read More..

BREAKING: కేసీఆర్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ 

Tags:    

Similar News