పార్టీ మార్పుపై BRS మాజీ ఎంపీ పొంగులేటి కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-26 13:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీలో కొందరు తనను ఇబ్బంది పెట్టాలని చూసినా.. పార్టీ గీత మాత్రం దాటనని స్పష్టం ఆయన చేశారు. ప్రజల కోరిక మేరకు ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి రెడీ అని పేర్కొన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెప్తుందని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో ఖమ్మం బీఆర్ఎస్‌లో మరోసారి వర్గపోరు బయటపడింది.

Tags:    

Similar News