Viral Photo: కేసీఆర్ కుర్చీ ఖాళీ! ఆవిర్భావ వేడుకల్లో కూర్చీ ఖాళీగా పెట్టిన సర్కార్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. దశాబ్ధి వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కోసం ఏర్పాటు చేసిన కూర్చీ ఖాళీగా కనిపించింది. తాజాగా దీనికి సబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దశాబ్ది వేడుకలకు రావాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ రాలేదు. అయితే, వేడుకలకు హాజరు కావడం లేదని సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల కేసీఆర్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కానీ ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ కోసం సీటు ఏర్పాటు చేసింది. దీంతో సీటు ఖాళీ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, తాత్కాలికమని, కానీ రాజకీయ విలువలు, గౌరవమర్యాదలు శాశ్వతమన్నారు. కేసీఆర్ రాడని తెలిసినా కార్యక్రమం ముగిసే వరకు ఆ సీటు అలా ఖాళీగానే ఉందని, కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి మధ్య తేడా స్పష్టంగా అర్థమవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.