కుమారుడిగా, భర్తగా, అన్నగా రాముడి జీవితం ఆదర్శనీయం: కేసీఆర్
దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడిగా, భర్తగా, అన్నగా రాముడి జీవితం ఆదర్శనీయమని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. సీతారాముల కృపాకటాక్షాలతో దేశ ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. తెలంగాణలోని భద్రాదిలో జరిగే సీతారాముల కల్యాణికి ప్రభుత్వం తరుఫున సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక, శ్రీరామ నవమి వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తు్న్నారు.