తెలంగాణ ప్రజలకు KCR గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్య ఫలాలు, దేశంలోని ప్రతి గడపకూ చేరిన నాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చినవారం అవుతామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2025-01-25 17:30 GMT
తెలంగాణ ప్రజలకు KCR గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి వెలకట్టలేని త్యాగాలతో సాధించుకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్య ఫలాలు, దేశంలోని ప్రతి గడపకూ చేరిన నాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను నెరవేర్చినవారం అవుతామని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక స్వయం పాలనను అమలులోకి తెచ్చి, భారతదేశాన్ని సార్వభౌమాధికార, గణతంత్ర దేశంగా నిలుపుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 ఏండ్లయిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాద మౌలిక విలువలను అనుసరిస్తూ, స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News