చింతమడకలో భార్యతో కలిసి ఓటు వేయనున్న కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయమే ప్రారంభం అవుతుంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక స్వగ్రామం. ఆ గ్రామంలో కేసీఆర్ కు ఓటు హక్కు ఉంది.
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభం అవుతుంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక స్వగ్రామం. ఆ గ్రామంలో కేసీఆర్ కు ఓటు హక్కు ఉంది. ఆ గ్రామంలోనే సతీమణి శోభ తో కలిసి కేసీఆర్ ఓటు వేయనున్నారు. అదే విధంగా మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నంది నగర్‌లో ఉదయం 8 గంటలకు ఓటు వేయనున్నారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు, హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో గల బీఎస్ డీఏవీ పబ్లిక్ స్కూల్ లో ఎమ్మెల్సీ కవిత ఉదయం 7.45 గంటలకు ఓటు హక్కును వినియోగించుకుంటారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేశారు.