వీల్ చైర్‌లోనే అసెంబ్లీకి BRS అధినేత కేసీఆర్

వీల్ చైర్మన్‌లోనే అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 8న ఎర్రవెల్లి ఫాం హౌజ్‌లో కేసీఆర్ బాత్ రూంలో జారిపడటంతో తుంటిఎముక విరిగింది.

Update: 2024-01-28 15:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వీల్ చైర్మన్‌లోనే అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 8న ఎర్రవెల్లి ఫాం హౌజ్‌లో కేసీఆర్ బాత్ రూంలో జారిపడటంతో తుంటిఎముక విరిగింది. దీంతో ఆయనకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో వీల్ చైర్‌లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఫౌం హౌజ్‌లో ఉన్న కేసీఆర్ ఈ నెల 30న హైదరాబాద్‌లోని నందినగర్‌లోగల ఇంటికి రానున్నారని, ఫిబ్రవరి 1న ఉదయం 10.30గంటల నుంచి 11 గంటల మధ్య అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..