దొర గారికి తెలంగాణ రైతులపై సోయి లేదు
రాష్ట్రంలో రైతులు తుఫానులో, నిరుద్యోగులు ఉప్పెనలో, ఉద్యోగులు సుడిగాలిలో, విద్యార్థులు వరదల్లో కొట్టుకుపోయినా దొర గారికి సోయి లేదు కానీ పక్క రాష్ట్రంలో మాత్రం రైతుల తుఫాను రాబోతుందని బొంకుతున్నారంటూ సోమవారం ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పీచ్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రైతులు తుఫానులో, నిరుద్యోగులు ఉప్పెనలో, ఉద్యోగులు సుడిగాలిలో, విద్యార్థులు వరదల్లో కొట్టుకుపోయినా దొర గారికి సోయి లేదు కానీ పక్క రాష్ట్రంలో మాత్రం రైతుల తుఫాను రాబోతుందని బొంకుతున్నారంటూ సోమవారం ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పీచ్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తొమ్మిదేండ్లలో 9వేల మంది తెలంగాణ రైతులు చనిపోయినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ అని, మూడెకరాల భూమి అని, పోడు పట్టాలు అని నమ్మించి గుంటనక్కలా వారి ఓట్లు తిన్నారంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాయితీ ఎరువులు, పంట నష్ట పరిహారం ఇవ్వకుండా అన్నదాతను ఆగం జేశాడని ఆరోపించారు. రైతుల సాక్షిగా వందకు వందశాతం ఎరువులు ఫ్రీ అని నమ్మక ద్రోహం చేశాడని షర్మిల మండిపడ్డారు. చేతికొచ్చిన పంట నీటి పాలైనా..రైతులకు రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు వరి వేస్తే ఉరేనని, కౌలు రైతు అసలు రైతే కాదని, ఇప్పుడు నేను రైతు నేస్తం అని కేసీఆర్ మొసలికన్నీరు కారుస్తున్నారంటూ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణలో అధికారం దూరం కాబోతుందని, దేశ రాజకీయాల్లోకి వెళ్లిన నీకు ఎక్కడికి వెళ్లినా గుణపాఠం తప్పదంటూ ఆమె సెటైర్లు వేశారు.
తెలంగాణలో రైతులు తుఫానులో, నిరుద్యోగులు ఉప్పెనలో, ఉద్యోగులు సుడిగాలిలో, విద్యార్థులు వరదల్లో కొట్టుకుపోయినా దొర గారికి సోయి లేదు కానీ పక్క రాష్ట్రంలో మాత్రం రైతుల తుఫాను రాబోతుందని బొంకుతున్నారు. తొమ్మిదేండ్లలో 9వేల మంది తెలంగాణ రైతులు చనిపోతే పట్టింపు లేదు. అప్పులపాలై కౌలు
— YS Sharmila (@realyssharmila) March 27, 2023
1/4