అందుకే రీడిజైన్ చేయాలని ఇంజినీర్లకు చెప్పా.. కాళేశ్వరంపై క్లారిటీ ఇచ్చిన KCR

కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాట్లాడారు.

Update: 2024-04-23 15:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాట్లాడారు. తెలంగాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేయాలని ఇంజినీర్లకు సూచించినట్లు తెలిపారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని వ్యాప్కో వాళ్లే చెప్పారని వెల్లడించారు. అందుకే ఏడాది పాటు గోదావరిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశామని అన్నారు. దశలవారీగా నీటిని ఎత్తిపోసుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు. సమైక్య పాలనలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని.. ఎత్తులో ఉన్న తెలంగాణకు ఎత్తిపోతలే దిక్కని నమ్మి ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యూహం మాత్రమే నాది అన్నారు. నిర్మాణంలో వేలు పెట్టడానికి తానేం ఇంజినీర్‌ను కాదని తెలిపారు. కాళేశ్వరాన్ని డిజైన్ చేసింది కేసీఆర్ అనడం కాంగ్రెస్ నేతల మూర్ఖత్వం అని మండిపడ్డారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు లోబడి ఏం చేయాలో అదే చేశానని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నది దేవుడి మీద ఒట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు అని అన్నారు. ముఖ్యమంత్రి, ఇతరులు వాగ్ధానాలు నెరవేర్చలేక.. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇలా తమ ఫ్రస్టేషన్‌ను చూపిస్తున్నాయని సెటైర్ వేశారు. మరోవైపు కాంగ్రెస్‌ సభలు అన్నీ అట్టర్‌ప్లాఫ్‌ అవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీది రాజకీయ వికృత క్రీడ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. కేసీఆర్‌ హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ అని చెప్పారు. కేసీఆర్‌ను తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేసి భంగపడ్డారని అన్నారు. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగాను.. నన్ను తగ్గించడమనేది ఉండదు. ఇది కాంగ్రెస్‌, బీజేపీ చిలిపి రాజకీయ క్రీడ అని ఆయన పేర్కొన్నారు.

Read More...

KCR అంటే ఒక ఇన్స్టిట్యూషన్.. నాట్ ఏ పర్సన్ 

Tags:    

Similar News