కేసీఆర్ ఓటమిని అంగీకరించారు: మాజీ మంత్రి షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాకు ముందుకు రాకుండా సీఎం కేసీఆర్ ఓటమిని

Update: 2023-12-01 07:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాకు ముందుకు రాకుండా సీఎం కేసీఆర్ ఓటమిని అంగీకరించారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ప్రజలు ఈసారి పట్టం కట్టినట్లు తెలుస్తుందని.. దొరల పాలన వద్దని భావించి ప్రజలు పెద్దఎత్తున కాంగ్రెస్‌కు ఓటేశారని చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అంటున్నాడని మండిపడ్డారు. దీపం ఆరిపోయే ముందు ఎక్కువగా వెలిగినట్లే.. గద్దె దిగే ముందు ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని కేటీఆర్ అంటున్నాడని సెటైర్ వేశాడు. తాను బరిలోకి ఉన్న నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్‌కు కనివినీ ఎరుగని రీతిలో మెజారిటీ వస్తుందని దీమా వ్యక్తం చేశారు. తనకు మెజారిటీ మైనారిటీ అనే ఫీలింగ్ లేదని.. మనమంతా ఇండియన్స్ షబ్బీర్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, షబ్బీర్ అలీ సొంత నియోజకవర్గమైన కామారెడ్డి నుండి ఈ సారి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై పోటీగా బరిలోకి దిగారు. దీంతో షబ్బీర్ అలీ కామారెడ్డికి బదులు.. నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేశారు.

Tags:    

Similar News