CBI వెళ్లి పోగానే తండ్రి Kcr వద్దకు Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించారు. ఆదివారం ఉదయం కవిత ఇంటికి వచ్చిన అధికారులు సుధీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు...

Update: 2022-12-11 14:55 GMT

దిశ వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించారు. ఆదివారం ఉదయం కవిత ఇంటికి వెళ్లిన అధికారులు సుధీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు. వివరాలు సేకరించిన అనంతరం కవిత ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్సీ కవిత వెంటనే ప్రగతి భవన్‌కు వెళ్లారు. . తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. సీబీఐ విచారణకు సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు కవిత వివరించారు.

మరోసారి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి వస్తే ఏం చేయాలన్నదానిపై ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత లీగల్ కౌన్సిల్‌తో కూడా చర్చించారు. ఇక సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హై టెన్షన్ వాతారణం కొనసాగింది. కవితను ఇంట్లోనే సీబీఐ అధికారులు విచారిస్తుండటంతో బయట బీఆర్ఎస్ కార్యకర్తలు  ఉత్కంఠగా చూశారు. ఎప్పుడు కవిత బయటకు వస్తుందా అని ఎదురు చూశారు. సీబీఐ విచారణ ముగిసి అధికారులు వెళ్లిపోవడంతో కవితకు సంఘీభావంగా నినాదాలు చేశారు.  అటు కవిత కూడా వారికి అభివాదం తెలిపారు. 

Tags:    

Similar News