అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి మహిళా దినోత్సవం జరుపుకున్న ఎమ్మెల్సీ కవిత
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం అంగన్ వాడీ ఉద్యోగులతో కలిసి, కేక్ కట్ చేసి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. తెలంగాణాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి జరిగినా ప్రభుత్వ సహకారం ఉండాలని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం, షాదీముబారక్ ద్వారా నిరుపేద కుటుంబీకులు ఎంతో లబ్ది పొందుతున్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116 అందజేస్తున్నారన్నారు. నిరు పేద ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ లాగా ఆడ పిల్లల పెళ్లికి డబ్బులు అందించడం సంతోషదగ్గ విషయమన్నారు.