కేసీఆర్ కు కవిత టెన్షన్.. గులాబీ బాస్ ను చుట్టుముట్టిన సమస్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుసపెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

Update: 2024-02-22 08:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుసపెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారం కోల్పోగానే కేసీఆర్ అనారోగ్యం భారిన పడగా గత ప్రభుత్వంలో తాము తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలతో పాటు ఒక్కొ నిర్ణయాలపై రేవంత్ రెడ్డి సర్కార్ వరుసగా తీగలాగే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పదనే అంచనాలు వెలువడుతున్న తరుణంలో అనూహ్యంగా కూతురు కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గామారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హజరు కావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వగా అదే రోజు అదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు తాజాగా ఈడీ నోటీసులు పంపడం పంపడం ఆసక్తిని రేపుతున్నది. ఇదిలా ఉంటే ఆపై రెండో రోజుకే ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీం కోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగనున్నది. తాజా పరిమామాల నేపథ్యంలో ఎప్పుడేం జరగబోతున్నదనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణులలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

కవిత అరెస్ట్ తప్పదా?:

కవితకు తాజాగా సీబీఐ నోటీసులు జారీ చేయడంతో ఈసారి ఆమె అరెస్ట్ తప్పదా అనే చర్చ తెరమీదకు వస్తోంది. గతంలో మూడు సార్లు కవితను ఈడీ ప్రశ్నించింది. ఒక సారి సీబీఐ విచారించింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు, సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై తుదివాదనలు జరగాల్సిన రోజుకంటే ముందే తమ ముందు హాజరుకావాలని సీబీఐ పిలవడంతో తాజా నోటీసులు ఎలాంటి ట్విస్ట్ కు దారి తీస్తోందనే చర్చ తెరపైకి వస్తోంది. అసెంబ్లీ ఓటమి తర్వాత ప్రస్తుతం గట్టు పరిస్థితిని ఎదుర్కొంటున్న గులాబీ బాస్ కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనే విషయంలో తలమునకలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో కవిత ఇష్యూమరోసారి తెరపైకి రావడంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు చిక్కులు తప్పవా అనే చర్చ జరుగుతోంది.

గుర్రుగా ఉన్న క్యాడర్:

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మొదటి నుంచి అనేక ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లతో రాజకీయ పరంగా ఉత్కంఠను రేపుతున్నది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా వినిపించినా అలాంటిదేమి జరగనప్పటికీ ఈ కేసు వల్ల పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. పార్టీ కోసం తాము సర్వస్వం ధారపోశామని కానీ కవిత మాత్రం అధికారం అండదండలతో పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాల్లో తలదూర్చారని క్యాడర్ గుర్రుగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ పొత్తుల ఈక్వేషన్ పై జోరుగా చర్చ జరుగుతున్న వేళ మరోసారి కవిత అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈసారి కవిత అరెస్ట్ జరిగినా జరగకపోయినా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపై చర్చనీయాంశంగా ఉంటే అది పార్టీకి డ్యామేజీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News